జనవరిలో 8 మంది... నిన్న ఏడుగురు: సైలెంట్‌గా విజయవాడలో అడుగుపెట్టిన బంగ్లా యువకులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-23 10:00:27  IST  )

విజయవాడలో బంగ్లాదేశ్ యువకుల కలకలం రేగింది...

జనవరిలో 8 మంది... నిన్న ఏడుగురు:  సైలెంట్‌గా విజయవాడలో అడుగుపెట్టిన బంగ్లా యువకులు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో బంగ్లాదేశ్ యువకుల కలకలం రేగింది. జనగరిలో నగరానికి 8 మంది రాగా.. గురువారం రాత్రి మరో ఏడుగురు వచ్చినట్లు ఇంటెలిజెన్స్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని రహస్య విచారణ జరుపుతున్నారు. జనవరిలో నగరానికి వచ్చిన యువకులు తాడిగడప(Tadigadapa), పెనమలూరు(Penamaluru), పోరంకి(Poranki) ప్రాంతాల్లో భవననిర్మాణ కార్మికులు(Construction workers)గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్‌లోని మయన్మార్(Mayanmar) నుంచి వచ్చినట్లు నిర్దారణ అయింది.

కాగా పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రలింకులు ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) ఇతర దేశాలకు చెందిన యువకులను గుర్తించి కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వాళ్ల స్వదేశానికి పంపుతున్నారు. ఈ 15 మంది బంగ్లాదేశ్(Bangladesh) యువకులకు ఉగ్రలింకులు ఉన్నాయా..?.. గతంలో వీరిపై కేసులున్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Next Story