తిరుమలకు చేరుకున్న బండ్లగణేష్ విజయసంకల్ప యాత్ర

by Naga Rani Yarlagadda |

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన విజయసంకల్పయాత్ర తిరుపతికి చేరింది. ఆయనకు స్థానిక ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆయనకు స్వాగతం పలికారు.

తిరుమలకు చేరుకున్న బండ్లగణేష్ విజయసంకల్ప యాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన విజయసంకల్పయాత్ర తిరుపతికి చేరింది. ఆయనకు స్థానిక ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్చించుకున్నారు. అనంతరం కాలినడకన తిరుమలకు బయల్దేరారు. జనవరి 19న హైదరాబాద్ నుంచి బండ్ల గణేష్ పాదయాత్ర చేపట్టగా.. 23 రోజుల్లో 520 కిలోమీటర్లు నడిచివెళ్లారు. శ్రీవారి ఆశీస్సులతో తన పాదయాత్ర విజయవంతమైందనని బండ్ల గణేష్ పేర్కొన్నారు. రేపు (బుధవారం) స్వామివారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టవ్వగా.. బండ్ల గణేష్ ఆవేదన చెందారు. ఆయన సేఫ్ గా బయటికొస్తే.. కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నానని, ఆ మొక్కును తీర్చుకునేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు వివరించారు.

Next Story