- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandla Ganesh: సీఎం సతీమణిని కుటుంబ సమేతంగా కలిసిన బండ్ల గణేష్
సీఎం చంద్రబాబు సతీమణి, వ్యాపారవేత్త నారా భువనేశ్వరిని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా కలిశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం చంద్రబాబు సతీమణి, వ్యాపారవేత్త నారా భువనేశ్వరిని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా కలిశారు. సంకల్ప పాదయాత్ర సక్సెస్ అయిన సందర్భంగా ఆయన నారా భువనేశ్వరితో భేటీ అయ్యారు. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా నారా భువనేశ్వరి వెల్లడించారు. సంకల్ప పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని వచ్చిన సినీ నిర్మాత, బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా కలవడం సంతోషం కలిగించిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆయన చూపిన అభిమానం మరువలేనిదని కొనియాడారు.
ఆ దేవదేవుడి కరుణాకటాక్షాలు వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ట్వీట్‌లో ఫోటోలను పంచుకున్నారు. కాగా, వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టైన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఆయన పాదయాత్ర ప్రారంభించిన విషయం విదితమే. షాద్ నగర్ నుంచి ఆయన తిరుమలకు ఆయన పాదయాత్ర చేశారు. 23 రోజుల పాటు 537 కిలోమీటర్ల మేర ఆయన సంకల్ప యాత్ర చేశారు.






