జగన్ సర్కారుపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |   (  Updated:2023-04-07 13:19:48  IST  )

హిందుపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ సర్కారుపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హిందుపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సలహాదారులంతా ఒకే సామాజిక వర్గం వారన్నారు. కులాల ఉచ్చులో ఓటర్లు పడొద్దన్నారు. ఏపీలో అసమర్థ పాలన నడుస్తోందన్నారు. సీఎంకు మెగా బైట్స్, గిగా బైట్స్ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. చెత్త మీద కూడా పన్ను వేయడం మన కర్మ అన్నారు. జనం అంటే జగన్ కు కక్ష అని అదో రకం సైకోతత్వం అన్నారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండి పడ్డారు. ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

Chalasani Srinivas: ఆంధ్రా ద్రోహులు వాళ్లే

బ్రేకింగ్ : నేడు కాషాయ కండువా కప్పుకోనున్న మాజీ సీఎం..

Next Story