సినీ ప్రస్థానంపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-16 16:26:48  IST  )

శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఆదివారం నందమూరి తారక రామారావు విగ్రహాన్ని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఆవిష్కరించారు.

సినీ ప్రస్థానంపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఆదివారం నందమూరి తారక రామారావు విగ్రహాన్ని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఆవిష్కరించారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటానని అన్నారు. తనను ఆదరిస్తున్న అభిమానులకు, హిందుపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాలు నేర్పించింది తండ్రి ఎన్టీఆర్ అని చెప్పారు. బీసీలకు అధికారాన్ని పంచిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అనంతరం హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముదిరెడ్డిపల్లిలోని చేనేత కార్మికులకు రాయితీ పనిముట్లను పంపిణీ చేశారు. ప్రపంచ పటంలో హిందూపురం నిలిచేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని బాలకృష్ణ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఈ సందర్భంగా కనకదాసు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Next Story