‘ఈ దుర్ఘటన మాటలకందని విషాదాన్ని నింపింది’.. బాలకృష్ణ ఎమోషనల్ కామెంట్స్

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-12 13:54:26  IST  )

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ రోజు(గురువారం) మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం పై ప్రముఖ నటుడు,

‘ఈ దుర్ఘటన మాటలకందని విషాదాన్ని నింపింది’.. బాలకృష్ణ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ రోజు(గురువారం) మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం పై ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన మాటలకందని విషాదాన్ని నింపింది అన్నారు. ప్రయాణికులతో పాటు సిబ్బంది.. అలాగే విమానం కూలిన ప్రదేశంలో ఉన్న మరికొంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం హృదయాన్ని తీవ్రంగా కలచివేస్తోందని బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు.

‘‘ఈ ప్రమాదంలో భారతీయులతో పాటు విదేశీయులు ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరం. ఈ జాతీయ విపత్తు సమయంలో దేశం మొత్తం ఒక్కటై బాధిత కుటుంబాలకు మానసిక బలం అందించాలి. బాధితులకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలి. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ వంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని నందమూరి బాలకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story