- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు సీటు పైకెక్కి బాలయ్య విజిల్.. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం..!
రెండవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. సభ ప్రారంభం అయిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.

దిశ, వెబ్‌డెస్క్: రెండవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. సభ ప్రారంభం అయిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తేయాలని ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుకు కేటాయించిన సీటుపైకి ఎక్కి విజిల్ ఊదుకుంటూ ఆందోళన చేశారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు బాలయ్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు సీటు పైకి ఎక్కి ఎందుకు.. ఇక ఆ సీట్లో కూర్చొమంటూ అంబటి రాంబాబు సెటైర్ వేశారు. వచ్చే ఎన్నికల తర్వాత బాలకృష్ణ ఎలాగూ అసెంబ్లీకి రారని.. ఇంటికెళ్లి విజిల్ ఊదుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. తండ్రిని చంపిన చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇక, టీడీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీ మరోసారి వాయిదా పడింది.
Read More..
బిగ్ బ్రేకింగ్: ఏపీ అసెంబ్లీ నుండి అచ్చెన్నాయుడు సస్పెండ్.. వీడియో తీయడంతో స్పీకర్ యాక్షన్..!
Nara Chandrababu Naidu : చంద్రబాబుకు బిగ్ షాక్: రిమాండ్ పొడిగింపు






