మూడు ప్రాంతాల రైతులకు ఆ కెనాల్ వరప్రదాయిని : మంత్రి నిమ్మల

by Naga Rani Yarlagadda |

హిందూపురం, పెనుగొండ, మడకశిర ప్రాంతాల రైతులకు మడకశిర బ్రాంచ్ కెనాల్ వరప్రదాయిని అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

మూడు ప్రాంతాల రైతులకు ఆ కెనాల్ వరప్రదాయిని : మంత్రి నిమ్మల
X

దిశ, వెబ్‌డెస్క్: హిందూపురం, పెనుగొండ, మడకశిర ప్రాంతాల రైతులకు మడకశిర బ్రాంచ్ కెనాల్ వరప్రదాయిని అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం శ్రీ సత్యసాయి జిల్లా రాచపల్లి వద్ద రూ.750 కోట్ల అంచనా వ్యయంతో.. మడకశిర - రాచపల్లి హంద్రీనీవా కాలువ విస్తరణ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిసి భూమిపూజ చేశారు. అనంతరం బాలకృష్ణ హిటాచి వాహనాన్ని నడిపి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బాలకృష్ణ కృషితోనే కెనాల్ విస్తరణకు నిధులు సాధించి పనులు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో నీటిపారుదలలో రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తే.. వాటిలో 51 శాతం నిధులను రాయలసీమకే కేటాయించినట్లు వివరించారు. గొడ్డలిపార్టీ రాయలసీమకు అన్యాయం చేస్తే.. కూటమి ప్రభుత్వం రత్నాల సీమగా మారుస్తోందని పునరుద్ఘాటించారు.

Next Story