మురళీనాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన బాలకృష్ణ

by Jakkula.Mamatha |

భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

మురళీనాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన బాలకృష్ణ
X

దిశ,వెబ్‌డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద పాక్ సైన్యం భారత పోస్టులపై కాల్పులతో విరుచుకుపడింది. ఈ ఎదురుకాల్పుల్లో ఏపీ(Andhra Pradesh)లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లితండా జవాన్ మురళీ నాయక్ తీవ్ర బుల్లెట్ గాయాలతో యుద్ధ రంగంలోనే వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్ యుద్ధ భూమిలో వీరమరణం పొందిన జవాన్ మురళినాయక్‌కు ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో జవాన్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna) మురళి నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. జవాన్‌ కుటుంబానికి తన వంతుగా ఒక నెల జీతాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా.. నందమూరి బాలకృష్ణ ఈనెల(మే) 12న(సోమవారం) మురళీ నాయక్ స్వగ్రామానికి వెళ్లనున్నారు. ఈ తరుణంలో జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రకటించిన నగదును వారికి అందజేయనున్నారు. అయితే.. తెలుగు జవాన్ మురళి నాయక్ మరణించడంతో కల్లితండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story