- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేపటి నుంచి పిల్లలకు బాల ఆధార్ కార్డులు జారీ.. ఏమేం కావాలంటే?

దిశ, వెబ్ డెస్క్: మన దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంటో అందరికీ తెలిసిందే. అందుకే ఐదేళ్ల లోపు పిల్లలకు యూఐడీఏఐ(UIDAI) కూడా ప్రత్యేకంగా బ్లూ కలర్ ఆధార్ కార్డుల్ని జారీ చేస్తుంటుంది. దీనినే 'బాల ఆధార్' అని కూడా పిలుస్తారు. దీనికి పిల్లల బయోమెట్రిక్ వివరాలు కూడా అవసరం ఉండదు. ఫొటో, పేరు, అడ్రస్, తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారంతోనే ఈ ఆధార్ జారీ చేస్తారు. ఐదేళ్ల తర్వాత బయోమెట్రిక్ వివరాలు సమర్పించి అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ అందించింది. రేపటి నుంచి రాష్ట్రంలో చిన్నారులకు ఆధార్ కార్డులను జారీ చేయనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 11.65 లక్షల మంది చిన్నారులకు ఆధార్ కార్డులు లేవని అధికారులు గుర్తించారు. ఈ మేరకు రేపటి నుంచి వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేసి ఈ బాల ఆధార్ కార్డులను జారీ చేయనున్నారు.
బాల్ ఆధార్ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలంటే..?
* పిల్లల తల్లిదండ్రుల ఆధార్ కార్డు, అడ్రస్, పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఒక ఫొటో తీస్కొని ఆధార్ సెంటర్‌కు వెళ్లాలి.
* ఆధార్ రిజిస్ట్రేషన్ ఫారం నింపాలి. దాంట్లో తల్లిదండ్రుల ఆధార్ వివరాల్ని కూడా అందించాలి. ఈ ఫారాన్ని UIDAI వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* తల్లిదండ్రుల ఫోన్ నంబర్‌నే పిల్లల ఆధార్ కార్డుకు కూడా అనుసంధానిస్తారు. అందుకే కచ్చితంగా నంబర్ కూడా ఫారంలో నింపాలి.
* తర్వాత మీరు ఇచ్చిన పత్రాల్ని ధ్రువీకరించి, ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఇస్తారు.
* 60 రోజుల్లో మీ పిల్లల పేరిట బాల్ ఆధార్ కార్డు జారీ చేస్తారు.
* ఈ బ్లూ ఆధార్ కార్డు పూర్తిగా ఉచితం. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.