Vallabhaneni Vamshi : వల్లభనేని వంశీకి బెయిల్

by Muthe.Rajitha |

వైసీపీ మాజీ నేత వల్లభనేని వంశీ(YCP Leader Vallabhaneni Vamshi)కి భారీ ఊరట లభించింది.

Vallabhaneni Vamshi : వల్లభనేని వంశీకి బెయిల్
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ మాజీ నేత వల్లభనేని వంశీ(YCP Leader Vallabhaneni Vamshi)కి భారీ ఊరట లభించింది. భూకబ్జా కేసులో గన్నవరం కోర్టు సోమవారం బెయిల్(Bail) మంజూరు చేసింది. గన్నవరంలోని ఆత్కూర్‌ పీఎస్‌లో 8 ఎకరాల భూమి కబ్జా చేశారని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని గన్నవరం కోర్టులో వంశీ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు నేడు విచారించింది. ఈ కేసులో పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ.. వంశీకి బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ పొందినంత మాత్రాన వంశీ బయటికి వచ్చే అవకాశాలు లేనట్టు సమాచారం. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి(Mangalagiri Attack) కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో కూడా బెయిల్ వస్తేనే ఆయన బయటికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో బెయిల్ మంజూరు కాకపోతే ఆయన బయటికి రానట్లేనని తెలుస్తోంది. అయితే వంశీ బయటికి వస్తారని ఆయన నివాసం వద్దకు భారీగా నాయకులు చేరుకుంటున్నారు.

Next Story