- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో బైజూస్‌ను వెంటనే నిషేధించాలి.. విద్యార్థి సంఘాల ఆందోళన
by Kema Shiva Kumar |
కార్పొరేట్ ముసుగులో దేశ వ్యాప్తంగా ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్న బైజూస్‌ను రాష్ట్రంలో నిషేధించాలంటూ గుంటూరులో పలు విద్యార్థి, యువజన సంఘాల నేతలు నిరసనకు దిగారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : కార్పొరేట్ ముసుగులో దేశ వ్యాప్తంగా ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్న బైజూస్‌ను రాష్ట్రంలో నిషేధించాలంటూ గుంటూరులో పలు విద్యార్థి, యువజన సంఘాల నేతలు నిరసనకు దిగారు. ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బైజూస్, ఆకాశ్ శిక్షణ కేంద్రాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి షేక్ వలీ మాట్లాడుతూ.. ఎవరికీ అర్థం కాని చదువులతో విద్యార్థుల జీవితాలతో బైజూస్ ఆటలు ఆడుతోందని ఆరోపించారు. ట్యాబ్‌ల పంపిణీలో కుంభకోణం జరిగిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌తో ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న అరండల్‌పేట పోలీసులు ఆందోళనకారులను ఈడ్చుకుంటూ వాహనాల్లో పడేశారు.
Next Story






