- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడలో ప్రతికూల వాతావరణం.. బిల్‌గేట్స్ ఫ్లైట్‌కు ల్యాండింగ్ కష్టాలు
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ విమానానికి విజయవాడ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం ఎదురైంది. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గడంతో, ఆయన ప్రయాణిస్తున్న విమానం గన్నవరం విమానాశ్రయం చుట్టూ గగనతలంలోనే చక్కర్లు కొడుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (Bill Gates) ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కీలక రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించేందుకు ఆయన తన బృందంతో కలిసి వస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో బిల్‌గేట్స్ ప్రయాణిస్తున్న విమానం విజయవాడ నగరం చుట్టూ చక్కర్లు కొడుతోంది. పొగమంచు, లో విజిబిలిటీ (Low Visibility) కారణంగా ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఆటంకం ఏర్పడినట్లుగా తెలుస్తోంది.
అరగంట తర్వాత సేఫ్ ల్యాండింగ్
లో విజిబిలిటీ కారణంగా బిల్‌గేట్స్ ప్రత్యేక విమానం అంతకు ముందు అరగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం ఫ్లైట్‌కు ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చాక గన్నవరం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






