- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు ప్రజలకు బ్యాడ్ న్యూస్! పాపికొండల యాత్ర తాత్కాలిక నిలిపివేత
తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. గోదావరి నదిలో సాగే ప్రముఖ పర్యాటక ఆకర్షణ అయిన ‘పాపికొండల విహారయాత్ర’ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు పర్యాటకులకు ఏపీ అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. రాజమండ్రి నుంచి గోదావరి నదిలో సాగే ప్రముఖ పర్యాటక ఆకర్షణ అయిన ‘పాపికొండల విహారయాత్ర’ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్న దృష్ట్యా పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇవాళ (బుధవారం) రాజమండ్రి నుంచి పాపికొండల యాత్రను రద్దు చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. వాతావరణం శాంతించి, పరిస్థితులు పూర్తిగా అనుకూలించిన తర్వాతే యాత్ర పునరుద్ధరణపై స్పష్టత ఇస్తామని తెలిపారు. అప్పటివరకు పర్యాటకులు సహకరించాలని, విహారయాత్రకు సంబంధించిన తదుపరి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ప్రాంతం వైపు భద్రాచలం నుంచి సాగే పాపికొండలు యాత్ర కొనసాగుతోంది.






