పులివెందులలో టెన్షన్...పీఎస్‌కు ఎంపీ అవినాష్‌ రెడ్డి

by velandi.Saikiran |

కడపలోని ( Kadapa) పులివెందులలో ( Pulivendula ) టెన్షన్ నెలకొంది. కాసేపటి క్రితమే పులివెందుల అర్బన్‌ పీఎస్‌కు YCP

పులివెందులలో టెన్షన్...పీఎస్‌కు ఎంపీ అవినాష్‌ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: కడపలోని ( Kadapa) పులివెందులలో ( Pulivendula ) టెన్షన్ నెలకొంది. కాసేపటి క్రితమే పులివెందుల అర్బన్‌ పీఎస్‌కు YCP ఎంపీ అవినాష్‌ రెడ్డి ( Avinash Reddy) వెళ్లారు. మహానాడు ( Mahanadu) కార్యక్రమం నేపథ్యంలో టీడీపీ తోరణాలు చించిన వైసీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. దింతో వైసీపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు.... పులివెందుల అర్బన్‌ పీఎస్‌కు తరలించారు.

వైసిపి నేతల అరెస్టుల నేపథ్యంలో... నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లారు ఎంపీ అవినాష్ రెడ్డి. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడారు. తమకు తగిలిన ఈ దెబ్బను మర్చిపోబోమని.. కూటమికి వార్నింగ్ ఇచ్చారు. మహానాడు నేపథ్యంలో టిడిపి నేతలు రెచ్చిపోతున్నారని ఫైర్ అయ్యారు.

కడప జిల్లాలో వైయస్సార్ విగ్రహాల చుట్టూ టిడిపి జెండాలు ( TDP) కట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీసారని కూడా మండిపడ్డారు. వాటిని తొలగించాలని కోరితే అధికారులు పట్టించుకోవడం లేదని.. నిప్పులు చెరిగారు. దీనిపై భవిష్యత్తులో.. రివేంజ్ తీర్చుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు ఎంపీ అవినాష్ రెడ్డి.

Next Story