- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రీ బస్సు స్కీం ఎఫెక్ట్: రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్
ఫ్రీ బస్సు స్కీం ఎఫెక్ట్‌తో ఆటో డ్రైవర్ రోడ్డున పడ్డారు..

దిశ, వెబ్ డెస్క్: ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ఫ్రీ బస్సు జర్నీ(Free Bus Journey) పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు. అవసరాల నిమిత్తం జర్నీ చేస్తూ ఫ్రీ పథకంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆటో డ్రైవర్లు(Auto Drivers) మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్సు పథకంతో మహిళలు ఆటోలు ఎక్కడం లేదని, అన్నింటికి బస్సుల్లోనే వెళ్తున్నారని, తద్వారా తమ ఉపాధి కష్టంగా మారిందని వాపోతున్నారు. ఫ్రీ బస్సు పథకానికి తాము వ్యతిరేకం కాదని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వివిధ రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఓ చోట మాత్రం ఫ్రీ బస్సు పథకాన్ని రద్దు చేయాలని ఆటో డ్రైవర్ కోరుతున్నారు. ఆ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆటో డ్రైవర్ చింతకాయల శ్రీనివాస్ విశాఖపట్నం - అమరావతి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఫ్రీ బస్ కారణంగా లక్షలాది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్ పథకం రద్దు చేయాలని ఆటో డ్రైవర్ చింతకాయల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.






