అక్రమంగా మట్టి తవ్వకాలు.. మూడు ట్రాక్టర్లు సీజ్

by Vemula.Srinu Prasad |

అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు....

అక్రమంగా మట్టి తవ్వకాలు.. మూడు ట్రాక్టర్లు సీజ్
X

దిశ, సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం కైలాసగిరి ర్యాంపు నుంచి అక్రమంగా బొండుమట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. రెవెన్యూ అధికారులకు అందిన సమాచారం మేరకు ర్యాంప్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా బొండుమట్టిని లోడ్ చేసి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను గుర్తించారు. సీజ్ చేసిన ట్రాక్టర్లను తదుపరి చర్యల నిమిత్తం సీతానగరం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు తమ నిఘాను మరింత పెంచుతామని రెవెన్యూశాఖ అధికారులు తెలిపారు.

Next Story