- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pulichintala: గేట్లు మూసివేత
పులిచింతల ప్రాజెక్టు క్రస్టు గేట్లను అధికారులు మూసివేశారు...

దిశ, వెబ్ డెస్క్: పులిచింతల ప్రాజెక్టు క్రస్టు గేట్లను అధికారులు మూసివేశారు. జలాశయం ఇన్ ఫ్లో 21 వేల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 19 వేల క్యూసెక్కులుగా ఉందని తెలిపారు. నాగార్జున సాగర్ గేట్లు మూసి వేయడంతో పులిచింతలకు వరద ప్రవాహం తగ్గిందని, ఇందుచేతనే పులిచింతల క్రస్టు గేట్లు మూసివేసినట్లు పేర్కొన్నారు.
కాగా నిన్న, మొన్నటి వరకూ ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో తెలుగురాష్ట్రాల్లో ఉన్న అన్ని జలాశయాలకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరింది. దీంతో గేట్లు విడుదల చేసి దిగువకు నీళ్లు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పులిచింతల జలాశయానికి కూడా భారీగా వరద నీరు రావడంతో క్రస్టు గేట్లను ఓపెన్ చేశారు. ప్రస్తుతం వర్షాలు తగ్గిపోవడంతో వరద నీటి ప్రవాహం తగ్గింది. ఈ మేరకు జలశయాల గేట్లను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పులిచింతల గేట్లను కూడా మూసివేశారు.






