- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్ హైజాక్‌కు యత్నం.. విశాఖలో కలకలం
by Vemula.Srinu Prasad |
విశాఖ జగదంబ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సుతో ఓ వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన కలకలం రేపింది. ..

X
దిశ, విశాఖపట్నం ప్రతినిధి: విశాఖ జగదంబ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సుతో ఓ వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన కలకలం రేపింది. టికెట్ ఇచ్చేందుకు రోడ్డు పక్కన బస్సు ఆపగా డ్రైవర్ కిందకు దిగిన సమయంలో, ఓ అగంతకుడు అకస్మాత్తుగా డ్రైవర్ సీటులోకి ఎక్కి బస్సును నడిపించారు.బస్సులో ప్రయాణికులు ఉన్నప్పటికీ నియంత్రణ లేకుండా దాదాపు కిలోమీటర్ మేర అడ్డంగా నడిపిస్తూ, మార్గమధ్యంలో వాహనాలు, వస్తువులను ఢీకొట్టారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొన్ని వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డ్రైవర్, కండక్టర్‌లను పోలీసులు విచారిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






