High court: మతం మారితే అట్రాసిటీ కేసు చెల్లదు..హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-01 04:07:06  IST  )

షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి మతం మారితే కులం వర్తించదని, అట్రాసిటీ కేసు చెల్లదని ఏపీ హైకోర్టు(Ap high court) సంచలన వ్యాఖ్యలు చేసింది.

High court: మతం మారితే అట్రాసిటీ కేసు చెల్లదు..హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి మతం మారితే కులం వర్తించదని, అట్రాసిటీ కేసు చెల్లదని ఏపీ హైకోర్టు(Ap high court) సంచలన వ్యాఖ్యలు చేసింది. బాపట్ల జిల్లా(bapatla) పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి చర్చి పాస్టర్ గా జీవనం సాగిస్తున్నారు. ఆనంద్ చర్చి నిర్వహించడంపై అదే గ్రామానికి చెందిన అక్కుల రామిరెడ్డి అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆనంద్ రామిరెడ్డితో పాటూ మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ(Sc,st Atrocity) కేసు పెట్టాడు. ఈ కేసును కొట్టివేయాలని రామిరెడ్డి, ఇతరులు కోర్టును ఆశ్రయించారు. ఇరువురి వాదన విన్న హైకోర్టు మతం మారిన తరవాత కులం వర్తించదని స్పష్టం చేసింది. మతం మారిన వ్యక్తి ఎస్సీ హిందువు కాలేడని, అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని సంచలన తీర్పునిచ్చింది.

Next Story