యాచకులపై రాళ్ల దాడి.. ఒకరు మృతి, మరో ముగ్గురికి గాయాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-07 10:18:15  IST  )

తిరుపతి కపిలతీర్థం కూడలిలో దారుణం జరిగింది....

యాచకులపై రాళ్ల దాడి.. ఒకరు మృతి, మరో ముగ్గురికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని వ్యక్తి ఒక్కసారిగా వీరంగం సృష్టించారు. ఫుట్‌పాత్‌పై ఉన్న యాచకులపై రాళ్లు రువ్వారు. దీంతో శేఖర్ అనే వ్యక్తితో పాటు ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందతూ శేఖర్ అనే వ్యక్తి మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు. మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిహబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు.

Next Story