అనంతపురంలో దారుణం.. జనరేటర్‌లో డెడ్ బాడీ

by Vemula.Srinu Prasad |

అనంతపురం సాయినగర్‌లో దారుణం జరిగింది...

అనంతపురంలో దారుణం.. జనరేటర్‌లో డెడ్ బాడీ
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం సాయినగర్‌లో దారుణం జరిగింది. భారతి హాస్పిటల్ జనరేటర్‌లో డెడ్‌బాడీ కలకలం రేగింది. దుర్వాసన రావడంతో జనరేటర్‌ను ఓపెన్ చేశారు. అయితే అందులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. వ్యక్తి డెడ్ బాడీని పోస్టుమార్టంకు తరలించారు. స్థానిక సీసీ టీవీ పుటేజును పరిశీలించారు. జనరేటర్‌లోకి ఓ వ్యక్తి వెళ్తున్న దృశ్యం రికార్డు అయింది. దీంతో ‘‘అతను, ఎవరు..?, జనరేటర్‌లోకి ఎందుకు వెళ్లారు. ఆత్మహత్య చేసుకున్నారా..?. ’’ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story