స్కూలులో రెచ్చిపోయిన విద్యార్థులు.. వంట మనిషిపై దారుణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-14 12:33:18  IST  )

ఏపీలో దారుణం జరిగింది...

స్కూలులో రెచ్చిపోయిన  విద్యార్థులు.. వంట మనిషిపై దారుణం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో దారుణం జరిగింది. మద్యం మత్తు(Alcohol intoxication)లో స్కూలు వంట మనిషి(Cook)పై తొమ్మిదవ, పదవ తరగతి విద్యార్థులు దాడి చేశారు. కృష్ణా జిల్లాలో జరిగింది. గన్నవరం మండలం గొల్లనపల్లి హైస్కూల్‌లో మిద్దెపై విద్యార్థులు కూర్చొని మందు తాగుతున్నారు. దీన్ని గమనించిన వంట మనిషి కాసిమ్మ విద్యార్థులను ప్రశ్నించించింది. వార్డెన్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో రెచ్చిపోయిన విద్యార్థులు.. కాసిమ్మపై దుప్పటి వేసి, గొంతు నులిమి దాడి చేశారు. ఈ దాడిలో బాధితురాలకు గాయాలయ్యాయి. వెంటనే గన్నవరం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కాసిమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story