తెనాలి ఆస్పత్రిలో దారుణం.. శానిటేషన్ కార్మికులకు లైంగిక వేధింపులు

by Vemula.Srinu Prasad |

తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది...

తెనాలి ఆస్పత్రిలో దారుణం.. శానిటేషన్ కార్మికులకు లైంగిక వేధింపులు
X

దిశ, వెబ్ డెస్క్: తెనాలి ప్రభుత్వ ఆస్పత్రి(Tenali Government Hospital)లో సూపర్ వైజర్ ఓవరాక్షన్‌కు పాల్పడుతున్నారు. శానిటేషన్ మహిళా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ బెదిరింపులకు దిగుతున్నారు. అంతేకాదు లైంగికంగా వేధింపులకు సైతం పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. ఆస్పత్రిలో సెల్ ఫోన్ కనిపించకపోవడంపై తనిఖీలు నిర్వహించారని, అయితే మహిళా అధికారి వాణి తమ లంగాలు, జాకెట్లు విప్పతీసి చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ప్రశ్నించినా విధుల నుంచి తీసివేస్తామని బెదిరించారని శానిటేషన్ మహిళా కార్మికులు వాపోయారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్విట్టర్ వీడియో లింక్ కోసం క్లిక్ చేయండి..

Next Story