- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజీబీవీ విద్యార్థినికి వాంతులు.. షాకింగ్ విషయం చెప్పిన వైద్యులు
అనకాపల్లి గొలుగొండ కేజీబీవీలో దారుణం జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి గొలుగొండ(Anakapalli Golugonda) కేజీబీవీ(KGBV)లో దారుణం జరిగింది. విద్యాలయంలో చదువుతున్న బాలిక తరచూ వాంతులు చేసుకుంటుంది. దీంతో విద్యాలయం సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు బాలిక గర్భం దాల్చినట్లు తెలిపారు. దీంతో సైలెంట్‌గా బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో బాలిక అసలు విషయం తెలిపింది. ఈ ఘటనతో కేజీబీవీ పాఠశాలలో బాలకలపై భద్రతపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎస్ సుధారాణి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. తండ్రి చనిపోవడంతో తల్లికి మరోకరితో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. ఈమేరకు బాలక అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంటుంది. ప్రస్తుతం బాలిక గర్భం దాల్చడంతో ఆమె భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నర్ధంగా మారింది. ఘటనపై అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






