అచ్చెన్నాయుడు ‘ఫస్ట్’.. అనిత ‘లాస్ట్’: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు రేటింగ్స్

by Ramesh Naini |   (  Updated:2026-03-12 10:15:47  IST  )

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై, వివిధ శాఖల్లో ఫైళ్ల క్లియరెన్స్ ఎంత వేగంగా జరుగుతోందనే అంశంపై మంత్రులకు ఆయన రేటింగ్స్ ప్రకటించారు.

అచ్చెన్నాయుడు ‘ఫస్ట్’.. అనిత ‘లాస్ట్’: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు రేటింగ్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై కీలక సమీక్ష నిర్వహించారు. పాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా, వివిధ శాఖల్లో ఫైళ్ల క్లియరెన్స్ ఎంత వేగంగా జరుగుతోందనే అంశంపై మంత్రులకు ఆయన రేటింగ్స్ ప్రకటించారు. ఏ మంత్రి ఫైళ్లను పరిష్కరించడానికి ఎంత సమయం తీసుకుంటున్నారో సీఎం గణాంకాలతో సహా వివరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

టాప్ రేటింగ్స్‌లో నిలిచిన మంత్రులు వీరే..

ముఖ్యమంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలిచి అందరికంటే వేగంగా ఫైళ్లను పరిష్కరిస్తున్నట్లు తేలింది. ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా మంత్రులు నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ నిలిచారు. ఇక ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.

హోం మంత్రికి చివరి స్థానం..

మరోవైపు, హోం మంత్రి వంగలపూడి అనిత ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరికంటే చివరలో ఉండటం గమనార్హం. మంత్రులు ఫైళ్లను పెండింగ్‌లో పెట్టకుండా, నిర్ణీత సమయంలోగా క్లియర్ చేయాలని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పరిపాలనలో వేగం ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందుతాయని, దీనిపై మంత్రులందరూ ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.

నేడు రెండో రోజు కలెక్టర్ల సదస్సు..

కలెక్టర్ల సమావేశం రెండో రోజు కూడా పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై అధికారుల ప్రత్యేక ప్రజంటేషన్, రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాలపై సంబంధిత శాఖలతో సీఎం సమీక్ష. విద్యా రంగంలో మార్పులు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై చర్చలు చేయనున్నారు. నేడు సాయంత్రం కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, చట్టం వ్యవస్థను బలోపేతం చేసే అంశాలపై కీలక దిశానిర్దేశం చేయనున్నారు.

అభివృద్ధిని అడ్డుకుంటే సహించం.. అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్

సంపద సృష్టే లక్ష్యంగా ముందుకు సాగాలి: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Next Story