- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతిలో దారుణం.. స్టూడెంట్‌ను ప్రెగ్నెంట్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్
తిరుపతిలో విద్యార్థినికి కడుపు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెండ్ చేశారు..

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో దారుణం జరిగింది. విద్యార్థినిని అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రెగ్నెంట్‌ను చేశారు. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీ(Tirupati National Sanskrit University)లో జరగడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది.
కాగా నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో ఒరిస్సాకు చెందిన విద్యార్థిని ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఆమెపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కన్నేశారు. లైంగికంగా వేధింపులకు గురిచేశారు. అనంతరం ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. అంతేకాకుండా లక్ష్మణ్ కుమార్ లైంగిక వేధింపులు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువకావడంతో వైస్ ఛాన్సలర్‌కు విద్యార్థిని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్(Professor Laxman Kumar) సస్పెండ్ చేశారు. అయితే లక్ష్మణ్ కుమార్ పై మిగిలిన స్టాఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. కానీ సంస్కృత యూనివర్సిటీ నుంచి విద్యార్థిని ఒరిస్సాకు వెళ్ళిపోయింది. దీంతో కేసుపై సందిగ్ధత నెలకొంది.
అయితే విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ రికార్డు చేసి ఆయన కూడా విద్యార్థిని లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపైనా విచారణ జరపాలనే డిమాండ్ యూనివర్సిటీలో వినిపిస్తోంది. చూడాలి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో.






