- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శాంతి సస్పెండెడ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న దేవాదాయశాఖ అధికారిణి శాంతిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దేవాదాయాశాఖ అధికారిణి కె. శాంతి సస్పెండ్ కు గురయ్యాడు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. శాంతి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సమాచారం రావడంతో.. ఏప్రిల్ 6వ తేదీన ఆమెపై కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 7వ తేదీ ఉదయం నుంచి ఆమెకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.1.37 కోట్ల వరకూ ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించారు. అదేరోజున శాంతిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పరచగా.. ఈనెల 21 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో శాంతిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
ఏపీ సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే.. వాళ్లను సస్పెండ్ చేయాలి. ఈ మేరకుశాంతిని విధుల నుంచి సస్పెండ్ చేశామని, ఏప్రిల్ 7 నుంచి ఆమె విధుల్లో లేరని కమిషనర్ ఆదేశాల్లో పేర్కొన్నారు. తమ అనుమతి లేకుండా ఆమె హెడ్ క్వార్టర్ ను వదిలి వెళ్లకూడదని పేర్కొన్నారు.






