- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి మళ్లీ షాక్.. బెయిల్ పిటిషన్ రద్దు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి అరెస్టయి విజయవాడ జిల్లా జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆమెకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం లో తాజాగా కూడా నిరాశే ఎదురైంది. ...

దిశ, వెబ్ డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు(Disproportionate assets case)లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి(Assistant Commissioner of Endowments Department K. Shanthi) అరెస్టయి విజయవాడ(Vijayawada) జిల్లా జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆమెకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం(ACB Special Court)లో తాజాగా కూడా నిరాశే ఎదురైంది. శాంతి తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం కోర్టు విచారించింది. అయితే ఆ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. నిందితురాలిపై ఉన్న అవినీతి కేసు విచారణ ప్రస్తుతం అత్యంత కీలక దశలో ఉందని ఈ సమయంలో ఆమెకు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు బెయిల్ మంజూరు ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్ గట్టిగా కోరింది.
శాంతి పిటిషన్ కొట్టివేత
దీంతో ప్రాసిక్యూషన్ వినిపించిన వాదనలతో ఏసీబీ కోర్టు పూర్తిగా ఏకీభవించింది. కేసు తీవ్రతను, దర్యాప్తు పురోగతిని పరిగణనలోకి తీసుకుంటూ శాంతి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె మరికొన్నాళ్లపాటు జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.






