ఎస్పీతో గోవా ట్రిప్‌.. ఖైదీ ప్రియుడికి పెరోల్.. దెబ్బతో రాష్ట్రమంతా ఫేమస్..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-17 13:11:45  IST  )

ఎస్పీతో గోవా ట్రిప్‌కు వెళ్లడంతోనే తన ప్రియుడికి పెరోల్ వచ్చిందనే ప్రచారంపై నెల్లూరు చెందిన అరుణ స్పందించారు. ..

ఎస్పీతో గోవా ట్రిప్‌.. ఖైదీ ప్రియుడికి పెరోల్.. దెబ్బతో రాష్ట్రమంతా ఫేమస్..!
X

దిశ, వెబ్ డెస్క్: ఆమె సాధారణ మహిళ. రౌడీ షీటర్‌ను ప్రేమించారు. శిక్ష పడుతుందని తెలిసినా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆయనంటే అంత ఇష్టం. అయితే మొత్తం సీన్ మారిపోయింది. ఎస్పీతో గోవా ట్రిప్ వెళ్లిందని ప్రచారం జరిగింది. అంతేకాదు జైల్లో జీవిత ఖైదుగా ఉన్న తన ప్రియుడికి పెరోల్ కూడా తెచ్చిందని ఆరోపణలు చక్కెర్లు కొడుతున్నాయి.

నెల్లూరు జిల్లాకు చెందిన అరుణ.. రౌడీ షీటర్‌ శ్రీకాంత్‌ను ప్రేమించారు. అయితే వ్యక్తి హత్య కేసులో శ్రీకాంత్ నెల్లూరు జిల్లా జైల్లో జీవిత ఖైదుగా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ మధ్య శ్రీకాంత్‌కు పెరోల్ వచ్చింది. ఇద్దరు ఎస్పీలు వ్యతిరేకించినా పెరోల్ రావడంతో అనుమానాలు కలుగుతున్నాయి. అయితే మూడో ఎస్పీతో ఆమె గోవా ట్రిప్‌కు వెళ్లడంతోనే శ్రీకాంత్‌కు పెరోల్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన యువ నాయకులతోనూ ఆమె టచ్‌లో ఉన్నారని, సెటిల్ మెంట్లు, లాబీయింగులు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీంతో ఆమె స్పందించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ ను తాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని చెప్పారు. వ్యక్తి హత్య కేసులో శ్రీకాంత్ జీవిత ఖైదు అనుభవిస్తున్నారని తెలిపారు. ఆయన తండ్రి వల్లే శ్రీకాంత్‌కు పెరోల్ వచ్చిందని స్పష్టం చేశారు. నెల్లూరులో తాను సాధారణ మహిళని చెప్పారు. తన పేరుతో బ్యాంకుల్లో కోట్లు లేవని పేర్కొన్నారు. ఎస్పీతో తాను గోవా వెళ్లినట్లు ఆధారాలుంటే చూపించాలని తెలిపారు. తనపై జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని, ఎలాంటి వాస్తవాలు లేవని పేర్కొన్నారు. అనవసరంగా తన వ్యక్తిగత జీవితాన్ని రచ్చ చేస్తున్నారని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story