Speaker Ayyanna Patrudu:రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభల ఏర్పాట్లు.. ఆ సమస్యలు పరిష్కరించడమే టార్గెట్!

by Jakkula.Mamatha |

రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆదేశాల మేరకు, డిసెంబర్ 6, 2024 నుంచి జనవరి 8, 2025 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Speaker Ayyanna Patrudu) తెలిపారు.

Speaker Ayyanna Patrudu:రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభల ఏర్పాట్లు.. ఆ సమస్యలు పరిష్కరించడమే టార్గెట్!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆదేశాల మేరకు, డిసెంబర్ 6, 2024 నుంచి జనవరి 8, 2025 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Speaker Ayyanna Patrudu) తెలిపారు. గ్రామస్థాయిలో భూమి తగాదాలు, రీ సర్వే అవకతవకలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి మండలంలో ఒక గ్రామంలో రోజుకు ఒకసారి సమావేశాలు జరుగుతాయి. చిన్న గ్రామాల్లో ఒక పూట, పెద్ద గ్రామాల్లో రోజంతా ఈ సభలు నిర్వహించబడతాయి అన్నారు. తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ VRO, మండల సర్వేయర్ వంటి అధికారులు సమావేశాల్లో పాల్గొంటారు. అవసరమైతే ఇతర శాఖల అధికారులను కూడా పిలుస్తారు.

ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్(Deputy Collector) పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారు. గత ప్రభుత్వంలో భూముల అక్రమాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సభల ద్వారా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలు తమ సమస్యల డాక్యుమెంట్లు(Documents), దరఖాస్తులు తీసుకురావాలని, రశీదు ఇవ్వబడుతుందని చెప్పారు. 45 రోజుల్లో సమస్యల పరిష్కారం ఉంటుందని స్పష్టం చేశారు. సభల అనంతరం రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ టీం ఏర్పాటుచేసి సమస్యల పరిష్కారం పరిశీలించి నివేదిక అందజేస్తుందని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించడమే తమ లక్ష్యమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.

Next Story