మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు.. తీర్పు?

by Naga Rani Yarlagadda |

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు (ACB Court)లో శుక్రవారం విచారణ జరిగింది.

మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు.. తీర్పు?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు (ACB Court)లో శుక్రవారం విచారణ జరిగింది. నిందితులకు బెయిల్ ఇవ్వడంపై ఇరువైపులా వాదనలు ముగిశాయి. తమకు బెయిల్ మంజూరు చేయాలని ఏ35 నవీన్ కృష్ణ, ఏ36 బాలాజీ యాదవ్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా.. ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తుది తీర్పును ఈ నెల 29న ఇస్తామని తెలిపింది.

కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి (Raj Kesireddy)కి చెందిన ఆస్తుల్ని జప్తు చేసి, బ్యాంక్ అకౌంట్స్ ను సీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే రెండుసార్లు కెసిరెడ్డి సహా పలువురు నిందితులు, సంస్థలకు చెందిన ఆస్తుల్ని జప్తు చేసేందుకు రెండు జీఓలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో రూ.13 కోట్లకు పైగా ఆస్తుల్ని జప్తు చేసేందుకు సీఐడీ (AP CID)కి అనుమతులు మంజూరు చేసింది.

Next Story