- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP High court:నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. విచారణ వాయిదా
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్(Nandigam Suresh)కు మరో భారీ షాక్ తగిలింది.

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్(Nandigam Suresh)కు మరో భారీ షాక్ తగిలింది. మహిళ హత్య కేసులో నందిగం సురేష్ ఇప్పటికే అరెస్ట్ అయి గుంటూరు జిల్లా(Guntur District) జైలులో(Guntur Jail) రిమాండ్ ఖైదీగా ఉన్నారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు ఆయనను రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. అయితే విచారణకు హాజరైన మాజీ ఎంపీ అడిగిన వాటికి సమాధానం చెప్పకపోవడం, విచారణకు సహకరించలేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. దీంతో నందిగం సురేష్ (Bapatla Former MP Nandigam Suresh)బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో (AP High Court) నేడు(గురువారం) విచారణ జరిగింది. ఈ క్రమంలో నందిగం సురేష్ తరపున వాదనలు ముగిశాయి. వాదనలు వినిపించేందుకు పోలీసుల తరపున న్యాయవాది కోర్టును సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం రేపటి (శుక్రవారం)కి వాయిదా వేసింది.






