- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జంతువుల కొవ్వు కలిసిందనడానికి మీరేమైనా నిపుణులా..TTD లడ్డూ వివాదంపై సుప్రీం
తిరుమల లడ్డూలో జంతు కొవ్వు వివాదం విషయంలో దాఖలైన పిటిషన్‍ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల లడ్డూ వ్యవహారంపై (Tirumala Laddu Controversy) సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా అని టీటీడీ లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‍పై విచారణ సందర్శంగా ప్రశ్నించింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఎవరూ మాట్లాడకుండా స్టే విధించాలని. ఇలాంటి పబ్లిక్ స్టేట్ మెంట్స్ ని సీబీఐ ఆపలేకపోతోందని మానూరు శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‍ను ఇవాళ సీజేఐ జస్టిస్ సూర్యాకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించారు. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోందని, అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామన్నారు. ఏమైనా ఆధారాలు ఉంటే సీబీఐ అధికారులకు అందించాలని సూచించింది. దర్యాప్తు పెండింగ్‍లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.






