రైతుల కష్టాలు పట్టవా... సీఎంకు జగన్​ ప్రశ్న

by Thanuru Gopichand |   (  Updated:2025-02-19 07:40:31  IST  )

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రైతుల కష్టాలు పట్టడం లేదని జగన్ ఆరోపించారు.

రైతుల కష్టాలు పట్టవా... సీఎంకు జగన్​ ప్రశ్న
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రైతుల కష్టాలు పట్టడం లేదని జగన్ ఆరోపించారు. మిర్చి యార్డులో కొద్దిసేపు రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి వస్తుంటే కనీసం పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదని, రేపు ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు భద్రత తీసివేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అంటూ హెచ్చరించారు. ఏపీ సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డ్ లో రైతులకు పడుతున్న అవస్థలు చంద్రబాబు నాయుడుకి అర్థం కావడం లేదన్నారు. వంద రూపాయల నుంచి రూ.400 అధికంగా బ్లాక్లో ఎరువులను అమ్ముతున్నట్లు ఆరోపించారు. క్వాలిటీ కంట్రోల్ లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు రైతులకు సరఫరా కావడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సీఎం చంద్రబాబు గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి రైతుల కష్టాలు వినాలని సూచించారు. రాష్ట్రంలో రైతులు ఏ పంట పండించిన గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదన్నారు. మరోవైపు చంద్రబాబు రైతులను దళారులకు అమ్మేశాడని జగన్​ ఆరోపించారు.

Next Story