- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమిటీ విచారించాల్సింది మా ఇద్దరిని.. అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలు రోజుకో వీడియోను బయటపెడుతోంది. తాజాగా మరో వీడియోను మహిళ విడుదల చేసింది. ముక్కా రూపానంద్ రెడ్డి రెడ్డే డబ్బులు పెట్టి శ్రీధర్ ను ఎమ్మెల్యే చేశాడని ఆరోపించింది.

దిశ, వెబ్ డెస్క్: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలు రోజుకో వీడియోను బయటపెడుతోంది. తాజాగా మరో వీడియోను మహిళ విడుదల చేసింది. ముక్కా రూపానంద్ రెడ్డి రెడ్డే డబ్బులు పెట్టి శ్రీధర్ ను ఎమ్మెల్యే చేశాడని ఆరోపించింది. శ్రీధర్ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడటంలేదో తనకు అర్థం కావడంలేదని చెప్పింది. జనసేన కమిటీ విచారించాల్సింది జనసైనికులను కాదని కమిటీ తనను, శ్రీధర్ ను విచారించాలని చెప్పింది. ఆ విషయం తమ వ్యక్తిగత వివాదం కాబట్టి తమనే విచారించాలని చెప్పింది. జనసైనికులను విచారిస్తే శ్రీధర్ కే అనుకూలంగా చెబుతారని తెలిపింది.
తనను విచారణకు పిలవకుండానే పిలిచినట్టు చెబుతున్నారని తెలిపింది. తానే మీడియా ముందుకు వచ్చినా డబ్బులు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని చెప్పింది. వ్యతిరేకంగా మాట్లాడితే డబ్బులు ఇస్తామని తనవాళ్లకే ఫోన్లు చేసి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. శ్రీధర్ ను బయటకు తీసుకువచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపింది.
తాను రాజకీయాలు చేయడం లేదని ఉన్న నిజాలు బయటపెడతున్నానని చెప్పింది. ముక్కా రూపానంద్ రెడ్డి ఇంటిళ్లిపాది అరవశ్రీధర్ ను కాపాడటానికి కష్టపడుతున్నారని అన్నారు. తాను శ్రీధర్ తేల్చుకోవాల్సిన విషయాన్ని రాజకీయం చేశారని అన్నారు. అన్ని విషయాలను తను కోర్టులో ప్రవేశపెడతానని చెప్పారు. సెక్షన్ల గురించి మాట్లాడుతున్నారని, నేను చనిపోతే సెక్షన్లు పనిచేస్తాయా అని ప్రశ్నించారు. అమ్మాయిల మనసుతో ఆడుకోవద్దని, రూపానంద్ రెడ్డి లాంటివాళ్లు ఇలాంటి వాటికి సపోర్ట్ చేయవద్దని అన్నారు.






