- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉచిత బస్సుపై మహిళలకు మరో గుడ్‌న్యూస్.. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కీలక వ్యాఖ్యలు
ఏపీ మహిళలకు కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు సౌకర్యాన్ని (Free Bus Journey) కల్పించనున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మహిళలకు కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు సౌకర్యాన్ని (Free Bus Journey) కల్పించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ఎండీ ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) మరో గుడ్ న్యూస్ చెప్పారు. తిరుపతి జిల్లా వెంకటగిరి బస్టాండ్ (Venkatagiri Bus Stand), డిపో ఆఫీసుల్ని పరిశీలించిన ఆయన.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళలకు ఉచిత బస్సుప్రయాణం అందిస్తామన్నారు. పల్లెవెలుగు బస్సులతో పాటు.. ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ సౌకర్యాన్ని అందించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ప్రతినెలా సమీక్షిస్తున్నారని తెలిపారు. ఉచిత బస్సు పథకం కోసమై ఇప్పటి వరకూ 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం మరో 600 బస్సులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. అలాగే అన్ని బస్టాండ్లలోనూ ప్రయాణికులకు కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర సదుపాయాలను కూడా కల్పిస్తామని తెలిపారు. ఫ్రీ బస్ జర్నీ ఒక జిల్లాకే పరిమితం కాకుండా.. జిల్లా సరిహద్దులు దాటి కూడా వర్తింపజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, ఉచిత బస్సు విధి విధానాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.






