- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google Maps: గుడ్‌న్యూస్.. ఇకపై గూగుల్ మ్యాప్స్‌లోనూ APSRTC బస్సు టికెట్‌లు!
ఇకపై ఆర్టీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో మాత్రమే కాకుండా గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా బస్సు టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ఆర్టీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో మాత్రమే కాకుండా గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా బస్సు టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం (ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. తాము చేరుకోవాల్సిన గమ్యస్థానానికి సంబంధించిన రూట్ మ్యాప్, దూరం తెలుసుకోవడంతో పాటు ఆ మార్గం గుండా వెళ్లే ఆర్టీసీ బస్సుల వివరాలను గూగుల్ మ్యాప్స్ అందించనుంది. ఇప్పటికే గూగుల్ మ్యాప్స్‌తో ఆర్టీసీ అనుసంధానం అయ్యింది. తాజాగా విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్‌లో ఇప్పుడు Google Maps ద్వారా APSRTC బస్సు టికెట్ బుక్ చేసుకోవచ్చు అని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఎలా బుక్ చేసుకోవాలంటే..?
గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించి బస్సు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే.. ముందుగా మీరు వెళ్లాల్సిన లోకేషన్ గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేయాలి. ఉదాహరణకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన వారు గూగుల్ మ్యాప్స్‌లోకేషన్ సెర్చ్ చేయాలి. అప్పుడు ఆ రూట్ల మధ్య దూరంతో పాటు బైక్, కారు, బస్సు, ట్రైన్ లాంటి వివిధ ఆప్షన్స్ కన్పిస్తాయి. అందులో బస్సు ఆప్షన్ సెలక్ట్ చేసినప్పుడు మనం వెళ్లాల్సిన రూట్‌లో ఏ సమయంలో బస్సు ఉందనే వివరాలను చూపిస్తుంది. బస్సు ఎక్కితే ఎంత సమయంలో గమ్యం చేరుకుంటారు తదితర వివరాలను యాప్ తెలియజేస్తుంది.
అందులో బుకింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే.. నేరుగా ఆది ఏపీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌కు కనెక్ట్ అవుతుంది. అక్కడ తమ వివరాలను ప్రయాణికులు నమోదు చేసి.. ఆన్‌లైన్‌లో ఈజీగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్‌లో ప్రయోగాత్మకంగా పరిశీక్షించారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.






