గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

by Malleboina Mahesh |   (  Updated:2025-05-01 14:40:13  IST  )

రాష్ట్రంలోని గ్రూప్-1 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. మేయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ఈ రోజు(గురువారం) రాత్రి విడుదల చేసింది.

గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని గ్రూప్-1 అభ్యర్థుల (Group-1 candidates)కు ఏపీపీఎస్సీ (APPSC) బిగ్ అలర్ట్ జారీ చేసింది. మేయిన్స్ పరీక్షల (Mains Exams)కు సంబంధించిన షెడ్యూల్ (Schedule) ను ఈ రోజు(గురువారం) రాత్రి విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మే 3న తెలుగు, మే 4న ఇంగ్లీష్, మే 5వ తేదిన జనరల్ ఎస్సే, మే 6న హిస్టరీ, 7న పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, 8న ఎకానమీ, డెవలప్‌మెంట్, 9న ఎస్సె, టెక్నాలజీ, పరీక్షలను నిర్వహించనున్నారు. కాగా నోటిఫికేషన్ ప్రకారం ఈ పరీక్షలను రాష్ట్రంలోని కీలక నగరాలు అయిన తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం వంటి నగరాల్లో మొత్తం 13 సెంటర్లలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ అవ్వగా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ గ్రూప్- 1 పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు.

కాగా అభ్యర్థులు ఉదయం 8. 30 గంటలలోపు సెంటర్‌లో రిపోర్టు చేయాలని ఏపీపీఎస్సీ ప్రకటన (APPSC)లో స్పష్టం చేసింది. కాగా ఈ గ్రూప్ -1 ప్రిలిమ్స్ (Group-1 Prelims) పరీక్షల మొత్తం కోసం 1,48,881 మంది రిజిస్టర్ చేసుకోగా, 72.5% మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ ప్రిలిమ్స్ ఫలితాలు ఏప్రిల్ 12, 2024న విడుదలయ్యాయి. కొందరు అభ్యర్థులు మూల్యాంకనంపై పిటిషన్లు దాఖలు చేయగా, కోర్టు వాటిని డిస్మిస్ చేసింది. మెయిన్స్ పరీక్ష మొదట సెప్టెంబర్ 2024కు షెడ్యూల్ చేయబడిన, తర్వాత మే 3 ‌కు వాయిదా వేశారు. తాజాగా కొత్త షెడ్యూల్‌ను ఎపీపీఎస్సీ అధికారులు ప్రకటించారు.

Next Story