గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు APPSC ఏర్పాట్లు

by Muthe.Rajitha |

ఏపీ గ్రూప్ 1(Group 1) ఉద్యోగాల భర్తీ తుది దశకు చేరుకోబోతోంది.

గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు APPSC ఏర్పాట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ గ్రూప్ 1(Group 1) ఉద్యోగాల భర్తీ తుది దశకు చేరుకోబోతోంది. ఇందులో భాగంగా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు(Group 1 Interviews) నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 89 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు APPSC ప్రణాళికలు చేస్తోంది. కాగా కమిషన్ చేసిన విజ్ఞప్తి మేరకు ఇంటర్వ్యూ బోర్డులో 27 మంది ప్రభుత్వ విభాగధిపతులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో వివిధ శాఖలకు చెందిన కమిషనర్లు, సెక్రేటరీలు తదితరులు ఉన్నారు.

ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వం.. 1:20 చొప్పున ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కమిషన్ కార్యదర్శికి సీఎస్ విజయానంద్ ఆదేశించారు.

Next Story