సీడబ్ల్యూసీ కమిటీల్లో దరఖాస్తులకు అవకాశం

by Thanuru Gopichand |

చైల్డ్ వెల్ఫేర్ కమిటీల్లో (CWC) వివిధ హోదాల్లో పనిచేసేందుకు ప్రభుత్వం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సీడబ్ల్యూసీ కమిటీల్లో దరఖాస్తులకు అవకాశం
X

దిశ, వెబ్ డెస్క్ : చైల్డ్ వెల్ఫేర్ కమిటీల్లో (CWC) వివిధ హోదాల్లో పనిచేసేందుకు ప్రభుత్వం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిసెంబరు 22తో దరఖాస్తుల సమర్పణకు గడువు ముగిసింది. అయితే అభ్యర్థుల సౌకర్యార్థం గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. దరఖాస్తు తేదీని డిసెంబర్ 29 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలని స్పష్టం చేసింది. అందుకోసం http://wdcw.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది. అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ సందర్శించి నిర్ణీత గడువు లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. బాలల సంక్షేమం, సంస్కరణల సేవలు, వీధి బాలల సంక్షేమ శాఖ సంచాలకులు ఎం. వేణుగోపాల్ రెడ్డి ఈ మేరకు ప్రకటనను జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాలల సంక్షేమ, సంస్కరణల సేవలు, వీధి బాలల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఖాళీలు భర్తీ కానున్నాయి. ఏపీలోని 26 జిల్లాల్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీల్లో చైర్ పర్సన్లు, సభ్యులు, జువైనల్ జస్టిస్ బోర్డుల్లో సోషల్ వర్కర్ సభ్యులు వంటి బాధ్యతల్లో భర్తీ జరగనుంది. ఆసక్తి గలవారు పైన పేర్కొన్న వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Next Story