AP | వైసీపీ అధికార ప్రతినిధి అరెస్ట్

by Thanuru Gopichand |

వైసీపీ (YCP) అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డిని (Karumuru Venkat Reddy) ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.

AP | వైసీపీ అధికార ప్రతినిధి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ (YCP) అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డిని (Karumuru Venkat Reddy) ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారుడైన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీశ్ కుమార్ నవంబరు 14న తాడిపత్రి (Tadipatri) సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద విగతజీవిగా దొరికారు. ఈ ఘటనపై ఇప్పటికే ఏపీ పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే వెంకట్ రెడ్డి ఏపీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ఓ టీవీ ఛానల్ డిబేట్ లో ప్రభుత్వంతో పాటు సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నాయకుడు ప్రసాద నాయుడు రూరల్ పోలీసులకు తన ఫిర్యాదును అందజేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూకట్ పల్లిలో కారుమూరు వెంకట్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం ఉదయం అక్కడకు చేరుకుని వెంకట్ రెడ్డిని అరెస్టు చేశారు.

Next Story