- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP | వాహ్ పవన్.. ఇది కదా రాజకీయ హుందాతనం
రాజకీయంగా హుందాతనం ప్రదర్శించడం అంటే ఇదేనేమో..!! వైరుధ్యం సిద్ధాంతాల పరంగానే కాని.. వ్యక్తిగతంగా కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి నిరూపించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రాజకీయంగా హుందాతనం ప్రదర్శించడం అంటే ఇదేనేమో..!! వైరుధ్యం సిద్ధాంతాల పరంగానే కాని.. వ్యక్తిగతంగా కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి నిరూపించుకున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసి తన పరిపక్వతను చాటుకున్నారు. రాజకీయ వేదికలపై ఎన్ని విమర్శలు చేసుకున్నా అవి సిద్ధాంతపరమైన, విధానమైనపరమైన విబేధాలేనని డిప్యూటీ సీఎం పరోక్షంగా సందేశాన్ని ఇచ్చారు. జగన్ కు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
వైయస్ జగన్ నేడు తన జన్మదినం జరుపుకుంటున్నారు. వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన సంబురాలను జరుపుతున్నారు. తమ నాయకుడి పుట్టిన రోజు వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వైయస్ జగన్ కు కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలను తెలపడం వైసీపీలోని పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. పార్టీలు వేరైనా తమ అభిమాన నటుడు మంచితనం నిరూపించుకున్నారని అనుకుంటున్నారు. విబేధాలు రాజకీయంగానే తప్ప వ్యక్తగతంగా కాదనే సందేశాన్ని ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధినేత్రికి ఇదే విధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారనే విషయాన్ని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.






