- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకులు, కట్లపొడి కోసం అనంతపూర్ వెళుతున్నా..ఫ్రీబస్ ముందు యువతి రీల్స్ వైరల్
లైకుల కోసం ఫ్రీబస్ పథకాన్ని వాడుకుంది ఓ మహిళ. అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ తన తల్లికి ఇష్టమైన కట్లపొడి, ఆకులు తీసుకువచ్చేందుకు ఉచితంగా తాడిపత్రి నుండి అనంతపూర్ వెళుతున్నట్టు చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్: కర్నాటకలో ఉచిత బస్ పథకం అమలు తరవాత తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇటీవలే ఏపీలోనూ ఉచిత బస్ పథకాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అయితే నిజానికి ఈ పథకం ఉద్దేశ్యం మహిళలు ఉచితంగా ప్రయాణిస్తూ వ్యాపారాలకో, ఉద్యోగాలకో వెళ్లడం. ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలబడుతూ నారీశక్తిగా ఎదగడం. కానీ ఈ పథకాన్ని కొందరు రీల్స్ కోసం వాడుతూ అపహాస్యం చేస్తున్నారు. తెలంగాణలో ఫ్రీబస్ గురించి అనేక వీడియోలు వైరల్ అయ్యాయి.
మహిళలు బస్ లో అల్లం వెల్లుల్లి తీస్తున్న వీడియోలు, షాపింగులకు వెళుతున్న వీడియోలు ఇలా చాలా వీడియోలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతోంది. లైకుల కోసం ఫ్రీబస్ పథకాన్ని వాడుకుంది ఓ మహిళ. అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ తన తల్లికి ఇష్టమైన కట్లపొడి, ఆకులు తీసుకువచ్చేందుకు ఉచితంగా తాడిపత్రి నుండి అనంతపూర్ వెళుతున్నట్టు చెప్పింది. ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఏపీలోనూ మొదలెట్టారా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.






