బిగ్ అల‌ర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

by velandi.Saikiran |

ఇవాళ ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

బిగ్ అల‌ర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కర్నూలు, నంద్యాల, బాపట్ల, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, పోలవరం, మన్యం, కోనసీమ, అనంతపురం, చిత్తూరు, సత్యసాయి లాంటి ప్రాంతాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇక మిగిలిన ప్రాంతాలలో తేలిక పాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు ఇప్పటికే చిత్తూరు, కడప జిల్లాల్లోని పలు ఏరియాలలో వర్షం ప్రారంభమైంది. ఈ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖ‌ర్ జైన్ కీలక సూచనలు చేశారు. మరొక వైపు గన్నవరం విమానాశ్రయంలో భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన ఇండిగో విమానం, వాతావరణం సహకరించకపోవడంతో గన్నవరంలో దిగలేదు. దీనిపై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story