రేపు జాగ్ర‌త్త...ఈ 76 ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు

by velandi.Saikiran |

ఏపీలోని 76 మండ‌లాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయ‌ని హెచ్చ‌రించింది వాతావ‌ర‌ణ శాఖ‌.

రేపు జాగ్ర‌త్త...ఈ 76 ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రేపు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని APSDMA హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం 76 మండలాలలో తీవ్ర వడగాల్పులు, మరో 134 మండలాలలో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఈ ప్రాంతాల్లో తీవ్ర‌మైన వ‌డ‌గాల్పులు

శ్రీకాకుళం జిల్లాలోని 19 మండలాలు, విజయనగరం 21, మన్యం 3, అల్లూరి 4, పోలవరం 5, విశాఖ 1, అనకాపల్లి 15, కాకినాడ 6, తూర్పు గోదావరి 2 మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలి పారు. ఈ త‌రుణంలోనే బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు. ఇక మంగళ వారం గరిష్ఠంగా తిరుపతిలోని వరదయ్యపాలెం 44.4 డిగ్రీలు, 288 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వెల్ల‌డించారు. మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Next Story