- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP | బిజెపిపై ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు
బిజెపిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శల బాణాలను సంధించారు.

దిశ, వెబ్ డెస్క్ : బిజెపిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శల బాణాలను సంధించారు. ఏపీలో బిజెపి ఎప్పటికీ బలపడదని కుండబద్ధలు కొట్టారు. తాజాగా ఆయన బిజెపిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. జాతీయ పార్టీనే గురి చేసుకొని ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. కేవలం బిజెపినే కాకుండా సనాతన ధర్మాన్ని కూడా ఉద్దేశిస్తూ ఉండవల్లి వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని బీజేపీయే నాశనం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుత్వం అనేది మతం కాదని, అది ఒక సంస్కృతి అని ఉండవల్లి స్పష్టం చేశారు. సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందని అన్నారు. దాన్ని రక్షించాల్సిన అవసరం బీజేపీకి లేదని గట్టిగానే చెప్పారు. ఇతరులకు నష్టం కలిగించకుండా సనాతన ధర్మాన్ని ఆచరించడమే అసలైన ధర్మమని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎప్పటికీ బలపడదని ఆయన జోస్యం చెప్పారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన దిష్టి వ్యాఖ్యలపైనా కూడా ఉండవల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం స్థానంలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తన సొంత వ్యాపారాలను ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి తాను వ్యతిరేకం కాదని చెబుతూనే రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాల భూమి ఎందుకు అవసరం అనే అంశంపై ఆయన కీలక ప్రశ్నను లేవనెత్తారు. ఉండవల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.






