- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP | నేడు మరోసారి సీఎంతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ
ఏపీలో జిల్లాల పునర్విభజనపై (District Reorganization) సీఎం చంద్రబాబు నాయుడుతో మంత్రివర్గ ఉప సంఘం మరోసారి నేడు భేటీ (Meeting) కానుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో జిల్లాల పునర్విభజనపై (District Reorganization) సీఎం చంద్రబాబు నాయుడుతో మంత్రివర్గ ఉప సంఘం మరోసారి నేడు భేటీ (Meeting) కానుంది. నిన్నటి సమావేశంలో మార్కాపురం, మదనపల్లెతో పాటు రంపచోడవరం, చింతూరు డివిజన్లను కలపకుండా కొత్త జిల్లా ఏర్పాటు చేయడమే మంచిదని మంత్రివర్గ ఉప సంఘానికి సీఎం సూచనలు చేశారు. జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మరికొన్ని సూచనలు సీఎం చేశారు. సీఎం సూచనలకు అనుగుణంగా మరో నివేదికతో మంత్రివర్గ ఉప సంఘం రూపొందించనుంది. దానిపై సీఎం అధ్యక్షతన మరోమారు చర్చ జరగనుంది. ప్రకాశం జిల్లాలోని అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను జాబితాలో చేర్చేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తగా అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది. బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రతిపాదనను ప్రస్తుతానికి వాయిదా వేశారు. గూడూరు డివిజన్ ను తిరుపతి నుంచి నెల్లూరు జిల్లాలో కలిపే ప్రతిపాదనను ముందుకు తేనున్నారు. నగరి డివిజన్ ను చిత్తూరు నుంచి తిరుపతి జిల్లాకు మార్చాలనే ప్రతిపాదన కూడా ప్రస్తుతం చర్చకు రానుంది. నేడు వీటిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.






