2026 సంక్రాంతికల్లా టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు : ఛైర్మన్ అజయ్

by Naga Rani Yarlagadda |

2026 సంక్రాంతి నాటికి పెండింగ్ టిడ్కో ఇళ్లల్లో (Tidco Houses) గృహ ప్రవేశాలు చేయిస్తామని ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వెల్లడించారు.

2026 సంక్రాంతికల్లా టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు : ఛైర్మన్ అజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: 2026 సంక్రాంతి నాటికి పెండింగ్ టిడ్కో ఇళ్లల్లో (Tidco Houses) గృహ ప్రవేశాలు చేయిస్తామని ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వెల్లడించారు. గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం చర్యల కారణంగానే ఇప్పటి వరకూ టిడ్కో ఇళ్ల సముదాయాల్లో సమస్యలు నెలకొన్నాయని తెలిపారాయన. ఈ అంశంపై బుధవారం మీడియాతో మాట్లాడిన అజయ్ కుమార్ వైసీపీపై విమర్శలు చేశారు. రూపాయికే ఇల్లు ఇస్తామని చెప్పిన వైసీపీ.. మాట తప్పిందని దుయ్యబట్టారు. లబ్ధిదారులు బ్యాంకుల వాయిదాల్ని చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని, టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు జరిగిన చోట కనీస మౌలిక వసతులు కూడా లేవన్నారు. ఆయా సమస్యలు నెలకొన్న ప్రాంతాల్లో పరిష్కారాలపై దృష్టి పెట్టామని, సంబంధిత శాఖల అధికారులతో సంప్రదింపులు జరిపి.. త్వరలోనే రాజధానిలో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Next Story