- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ : కొలిక్కి వచ్చిన కొత్త జిల్లాల ఏర్పాటు అంశం
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఒక కొలిక్కి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఒక కొలిక్కి వచ్చింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దుల నిర్ణయం, పేర్ల మార్పుకోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ రేపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అర్జీలపై ముఖ్యమంత్రితో కేబినేట్ సబ్ కమిటీ సభ్యులు చర్చించనున్నారు. నవంబరు 7న జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల ఏర్పాటు, పేర్ల మార్పు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం గెజిట్ విడుదల కానుంది. ఇప్పటికే 200ల వరకు అర్జీలు కేబినెట్ సబ్ కమిటీకి అందాయి. వాటిపై సబ్ కమిటీ చర్చించడమే కాకుండా ఆయా జిల్లాల అధికారుల అభిప్రాయాలను కూడా సేకరించింది. అయితే ఈ విషయమై అగస్టు 13న ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తొలి సమావేశం జరిగింది. డిసెంబరు 31 నుంచి జనగణన ఉన్న నేపథ్యంలో అప్పటిలోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.






